తానా 23వ మహాసభలకు హాజరు కానున్న ప్రముఖ ధ్యాన గురువు కమలేష్ డి. పటేల్
జులై 7 నుంచి 9 వరకు ఫిలడెల్ఫియాలో జరుగనున్న 23వ తానా మహాసభలకు విశిష్ట అతిథిగా కమలేష్ డి. పటేల్ హాజరవుతారని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల సమన్వయకర్త పొట్లూరి రవి వెల్లడించారు.
దిల్లీ: ప్రఖ్యాత ధ్యాన గురువు కమలేష్ డి. పటేల్(దాజీ) జులై 7 నుంచి 9 వరకు ఫిలడెల్ఫియాలో జరుగనున్న 23వ తానా మహాసభలకు విశిష్ట అతిథిగా హాజరవుతారని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల సమన్వయకర్త పొట్లూరి రవి వెల్లడించారు. ఆధ్యాత్మికత విస్తరణకు విశేష కృషి చేస్తున్నందుకు కమలేష్ డి. పటేల్‌కు బుధవారం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. హార్ట్‌ఫుల్‌నెస్ మూవ్‌మెంట్ స్థాపకుడిగా, ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాలలో ఒకటైన కన్హా శాంతి వనాన్ని అభివృద్ధి చేసి విశేష సేవలందిస్తున్న దాజీ.. పద్మభూషణ్ సత్కారం అందుకోవడం పట్ల తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, 23వ మహాసభల సమన్వయకర్త పొట్లూరి రవి హర్షం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు