యూఏఈలో ప్రవాస పద్మశాలీల ఉగాది వేడుకలు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో ప్రవాస పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

Updated : 28 Mar 2023 06:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో ప్రవాస పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. దాదాపు వెయ్యి తెలుగు పద్మశాలి ప్రవాస కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సాంప్రదాయ ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికి వడ్డించారు. పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. యూఏఈ ఇమిగ్రేషన్‌ అధికారి అల్‌ అమిరి ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కాగా పద్మశాలి సంఘం నేతలు జగదీశ్‌, శ్రీసాగర్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, సందీప్‌, సౌజన్య, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు