వాసవిక్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో శతచండీ హోమం

సింగపూర్ చైనాటౌన్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో ఇటీవల మహా కుంభాభిషేక క్రతువును పురస్కరించుకొని మండల పూజలు, శతచండీ హోమం, తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.

Published : 02 Apr 2023 15:53 IST

సింగపూర్ చైనాటౌన్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో ఇటీవల మహా కుంభాభిషేక క్రతువును పురస్కరించుకొని మండల పూజలు, శతచండీ హోమం, తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య కుటుంబాలు అత్యంత భక్తి, శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి ఈ కార్యక్రమ బాధ్యతలను క్లబ్ సీనియర్ సభ్యుడైన ముక్కా కిషోర్‌కి అప్పగించి నిర్విఘ్నంగా పూర్తి చేశారు. వాసవి క్లబ్ దశమ వార్షికోత్సవ సమయంలో ఎంతో అరుదైన మహా కుంభాభిషేకం చేయటం ఆర్యవైశ్యులపై శ్రీ వాసవి అమ్మవారి కృపకు నిదర్శనమని క్లబ్ వ్యవస్థాపక గౌరవాధ్యక్షులైన వెంకట్ నాగరాజ్ కైలా, గౌరవ సెక్రటరీ మంచికంటి శ్రీధర్ అన్నారు. ఇంతటి భక్తి ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవటం ఇక్కడి ఆర్యవైశ్యుల సంఘీభావానికి నిదర్శనమని క్లబ్ అధ్యక్షులైన అరుణ్ కుమార్ గట్లూరు, క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి ఆనందం వ్యక్తం చేశారు.

వాసవిక్లబ్‌లో సీనియర్ సభ్యులైన మురళి కృష్ణ పబ్బతి, రాజశేఖర్ గుప్త, మకేష్ భూపతి,నూతన సభ్యులైన సుమన్ రాయల, ఆనంద్ గందె, వినయ్, కిషోర్ శెట్టి, సరిత, ఫణీష్,  వాసవి మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాద బలం లేకపోతే ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించటం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేందుకు వాసవి క్లబ్ మెర్లయన్ కార్యనిర్వాహక విజయ్ సారధి పాడి, శ్రీకాంత్ నూతిగట్టు, సరితా దేవి, దివ్య గాజులపల్లి, భార్గవి, హేమ కిషోర్, రాజశేఖర్ గుప్త, శ్రీవాణి, చైతన్య పురుషోత్తం, వాసవి ఫణీష్, హేమ కిషోర్‌ల తమ విశేష సహకారాన్ని అందించారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని