క్లబ్‌ వరల్డ్‌ సిరీస్‌కు ముగ్గురు తెలుగువాళ్లు ఎంపిక

ముగ్గురు తెలుగు కార్మిక సోదరులు పినకాన తులసి రామ్, సీడి దిలీప్ వరప్రసాద్, అక్కరమని గణేష్ కుమార్‌లు క్లబ్‌ వరల్డ్‌ సిరీస్‌కు పంపుతున్నట్లు ఇండోర్ క్రికెట్ అసోసియేషన్(ఐసీఏ) సింగపూర్‌ ప్రతినిధులు తెలిపారు.

Published : 13 Apr 2023 20:30 IST

సింగపూర్‌: సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో ‘మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్’ (MFCL) టోర్నమెంట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు తెలుగు కార్మిక సోదరులు పినకాన తులసి రామ్, సీడి దిలీప్ వరప్రసాద్, అక్కరమని గణేష్ కుమార్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో వీరిని ఏప్రిల్‌ 24-29 తేదీల్లో దుబాయ్‌లో జరిగే క్లబ్‌ వరల్డ్‌ సిరీస్‌కు పంపుతున్నట్లు ఇండోర్ క్రికెట్ అసోసియేషన్(ఐసీఏ) సింగపూర్‌ ప్రతినిధులు మురళీధరన్ గోవిందరాజన్, శంకర్ వీర ఒక ప్రకటనలో తెలియజేశారు. ఐసీఏ టీం కెప్టెన్‌గా రామ్ మడిపల్లి వ్యవహరించనున్నారు.

ముగ్గురు తెలుగువాళ్లు దుబాయ్ ఇండోర్‌ క్రికెట్ సిరీస్‌కి ఎంపిక అవ్వడం పట్ల టోర్నమెంట్ నిర్వాహకులు గిరిధర్ సారాయి, నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్, సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి, మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, ఎస్‌ కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ సంస్థ తరఫున క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసి, ఈ టోర్నమెంట్‌ లో కూడా విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు