Chicago: లెవిస్ యూనివర్సిటీలో సత్తా చాటిన తెలుగుతేజాలు
అమెరికాలోని షికాగోలో ఉన్న లెవీస్ యూనివర్సిటీలో తెలుగు తేజాలు సత్తా చాటారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టార్టప్ ఐడియా పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలోని షికాగోలో ఉన్న లెవీస్ యూనివర్సిటీలో తెలుగు తేజాలు సత్తా చాటారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టార్టప్ ఐడియా పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆరుగురు ఫైనల్స్‌కు చేరుకోగా.. వారిలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేడుకు చెందిన షమ్మి సాయిచరణ్, రామా చైతన్య, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన హష్మీ విజేతలుగా నిలిచారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డును దక్కించుకున్న తెలుగు విద్యార్థులను పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా ప్యానల్‌లోని న్యాయనిర్ణేతలు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది విద్యార్థుల ఆలోచనకు మద్దతు తెలిపారని చెప్పారు. విద్యార్థుల ప్రజెంటేషన్, కంటెంట్, ఐడియా చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. విజేతలకు 2వేల డాలర్ల చెక్‌కు అందజేశారు. యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ షమ్మి చరణ్, రామచైతన్య, హష్మీల కృషి, పట్టుదల భావితరాలకు ఎంతో ఆదర్శమని ప్రశంసించారు. తమ సహాయ సహకారాలు వారికి ఎప్పుడూ ఉంటాయని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది