అమెరికాలో ‘మాట’ ఆవిర్భావం

ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలకు సేవలందించాలన్న సంకల్పంతో ‘మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌’ (మాట) పేరిట కొత్త తెలుగు సంఘం ఆవిర్భవించింది.

Updated : 17 Apr 2023 05:41 IST

ప్రవాస తెలుగు ప్రజలకు సేవలే లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలకు సేవలందించాలన్న సంకల్పంతో ‘మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌’ (మాట) పేరిట కొత్త తెలుగు సంఘం ఆవిర్భవించింది. న్యూజెర్సీలో జరిగిన ఆవిర్భావ సభలో దాదాపు 2,500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మాట’ వ్యవస్థాపకులు శ్రీనివాస్‌ గనగోని, ప్రదీప్‌ సామల మాట్లాడుతూ.. సేవ, సంస్కృతి, సమానత్వం అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించామన్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్‌, డల్లాస్‌, అట్లాంటా, షికాగో, హ్యూస్టన్‌, డెట్రాయిట్‌ తదితర 20 నగరాల్లో ‘మాట’ కమిటీలను ప్రారంభించామని, ఇప్పటివరకు 2 వేల మంది జీవితకాల సభ్యులుగా చేరారని తెలిపారు. తానా, ఆట, నాట, నాట్స్‌ తదితర తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ‘మాట’కు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ కోర్‌ టీమ్‌ సభ్యులు శ్రీధర్‌ చిల్లర, దాము గేదెల, స్వాతి అట్లూరి, జితేందర్‌రెడ్డి, డాక్టర్‌ స్టాన్లీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నేపథ్యగాయని సునీత తన సహగాయకుడు అనిరుధ్‌తో కలిసి నిర్వహించిన సంగీత కచేరి అలరించిందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు