ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో జూన్‌ 2న మినీ మహానాడు, ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

కువైట్‌లో మినీ మహానాడు, నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తునారు.

Published : 25 Apr 2023 15:29 IST

కువైట్‌ : ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో మినీ మహానాడు, నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తునారు. జూన్ 2న కువైట్‌లో భారీగా నిర్వహించ తలపెట్టిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మహాసేన రాజేష్ ప్రత్యేకంగా భారత్‌ నుంచి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గల్ఫ్ ఎంపవర్మెంట్‌ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు, అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎనుగొండ నరసింహ నాయుడు, సోషల్ మీడియా ఇంఛార్జి వెంకట సుబ్బారెడ్డి, అహ్మది గవర్నరేట్ కో-ఆర్డినేటర్ ఈడుపుగంటి దుర్గా ప్రసాద్, ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ కో-ఆర్డినేటర్ పెంచల్ రెడ్డి, మైనార్టీ నాయకుడు చాన్ బాషా, కల్యాణ్ కుమార్ సోమేపల్లి, చిన్నా రాజు, మల్లికార్జున యాదవ్, కొల్లి ఆంజనేయులు, గూదే శంకర్, శివ మద్దిపట్ల, ఇమ్మిడిసెట్టి సూర్యనారాయణ, ఇతర కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు నందమూరి అభిమానులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు