త్వరలో అమెరికా వీసా స్లాట్లు
అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త అందింది. ఈ నెల రెండో వారంలో వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్‌మెంట్ స్లాట్స్‌ను విడుదల చేయనున్నట్లు యూఎస్‌ఏ ప్రకటించింది.
ఈ నెల రెండో వారంలో వచ్చే అవకాశం
ఎఫ్-1 దరఖాస్తుదారులకు ఆన్‌లైన్‌లో రేపు అవగాహన
ఈనాడు, హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త అందింది. ఈ నెల రెండో వారంలో వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్‌మెంట్ స్లాట్స్‌ను విడుదల చేయనున్నట్లు యూఎస్‌ఏ ప్రకటించింది. మునుపటితో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలోనే విద్యార్థి వీసాలు(ఎఫ్-1) జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. స్లాట్లకు స్పష్టమైన తేదీలను ప్రకటించలేదు. దాంతో విద్యార్థులు తరచూ అమెరికా కాన్సులేట్ వెబ్‌సైట్‌ను పరిశీలించుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయిదు నగరాల్లో ఎక్కడైనా ఇంటర్వ్యూ
అమెరికాలోని విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం స్ప్రింగ్, ఫాల్ సీజన్లలో ప్రవేశాలను అనుమతిస్తాయి. ఫాల్ సీజన్‌లోనే మన దేశ విద్యార్థులు అధికంగా వెళుతుంటారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి అధిక శాతం మంది విద్యార్థులు వివిధ వర్సిటీల నుంచి ఐ-20 ధ్రువపత్రాలను పొందారు. వీరికి దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాల్లోని కాన్సులేట్ కార్యాలయాలల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూ తేదీలు ఎక్కడ లభించినా హాజరయ్యేందుకు విద్యార్థులు సన్నద్ధంగా ఉండాలని పలువురు నిపుణులు ‘ఈనాడు’తో తెలిపారు. అమెరికా ఈ ఏడాది 10 లక్షల వీసా దరఖాస్తులను పరిశీలించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. రద్దీని నియంత్రించేందుకు ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హత ఉందా? లేదా? అన్నది దరఖాస్తుదారులు చెక్ చేసుకుని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు గతంలోనే ప్రకటించారు. జూన్, జులై నెలల్లో విడుదలయ్యే వీసా స్లాట్లలో విద్యార్థులకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఏప్రిల్‌లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గతంలో విద్యార్థి వీసా కోసం ఇంటర్వ్యూకు హాజరై, అర్హత పొందని వారి పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇలాంటి వారికి ప్రత్యేకంగా స్లాట్లు విడుదల చేస్తామని అమెరికా ప్రకటించింది. గత స్ప్రింగ్ సీజన్‌లో రెండో దఫా ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు అంతగా అవకాశం లభించలేదన్న అభిప్రాయం విద్యార్థుల నుంచి ఇప్పటికీ వ్యక్తమవుతోంది. నిరుటితో పోలిస్తే ఈసారి ఎక్కువ వీసాలు జారీ చేసే అవకాశమున్న దృష్ట్యా రెండోదఫా ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి అవకాశం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆన్‌లైన్‌లో అవగాహన
ఎఫ్-1 వీసా దరఖాస్తులపై అనుమానాల నివృత్తికి ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో అవగాహన కార్యక్రమం ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?