తానా ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానం అమలు

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానానికి బోర్డు ఆమోదం తెలిపింది. సభ్యులకు ఈ మెయిల్‌ ద్వారా వచ్చే లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వీలుంటుంది.

Updated : 06 May 2023 05:54 IST

ఈనాడు-అమరావతి: తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానానికి బోర్డు ఆమోదం తెలిపింది. సభ్యులకు ఈ మెయిల్‌ ద్వారా వచ్చే లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వీలుంటుంది. రెండు రోజుల కిందట జరిగిన సమావేశంలో మెజార్టీ సభ్యులు దీనికి ఆమోదం తెలిపినట్లు తానా వర్గాలు తెలిపాయి. ఎన్నికల విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించాయి. త్వరలోనే ఈ విషయం కొలిక్కి వస్తుందని పేర్కొన్నాయి. ఎన్నికల్లో భాగంగా కొత్తవారికి ఓటింగ్‌ హక్కు కల్పించే విషయంలో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొందరు ఆర్బిట్రేటర్‌ వద్ద పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన అవార్డు ఇలా...

ఈ వివాదంపై ఇటీవల ఆర్బిట్రేటర్‌ అవార్డు జారీ చేశారు. కొత్త వారికి ఓటు హక్కు విషయంలో తానా డైరెక్టర్ల బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఆర్బిట్రేటర్‌(మధ్యవర్తి) సమర్థించారు. దీని వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ఇరువైపులా వాదనలను విన్న అనంతరం.. ఆర్బిట్రేటర్‌ శాలీ డి అడ్కిన్స్‌ ఈ మేరకు ఏప్రిల్‌ 26న అవార్డు జారీ చేశారు. అధికార పరిధి లేకుండా, మోసపూరితంగా బోర్డు నిర్ణయాలు తీసుకున్నప్పుడే మేరీలాండ్‌ చట్ట ప్రకారం సవాల్‌ చేసే వీలుంటుందని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌ 30 నాటికి కొత్త సభ్యుల దరఖాస్తులను పరిశీలించడంలో ఎంవీసీ విఫలమైందనే ఆరోపణలు ఉన్నా.. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, అది చిన్నపాటి తప్పిదమని ఆర్బిట్రేటర్‌ గుర్తించారు. బహుళ వివాదాలకు తావివ్వకుండా సమస్య పరిష్కరించాలనే సదుద్దేశంతో బోర్డు వ్యవహరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని