TANA: తానా మహాసభలకు చంద్రబాబుకు ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు విశిష్ఠ అతిథిగా రావాలని తెదేపా అధినేత చంద్రబాబును ఆహ్వానించారు.

Updated : 31 May 2023 13:44 IST

ఈనాడు, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు విశిష్ఠ అతిథిగా రావాలని తెదేపా అధినేత చంద్రబాబును ఆహ్వానించారు. తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి లావు, కార్యదర్శి శశికాంత్‌ మల్లేపల్లి, మహాసభల అవార్డుల కమిటీ ఛైర్మన్‌ రామ్‌ బొబ్బాలు మంగళవారం మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7,8,9 తేదీల్లో ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. రాజకీయ, సినీరంగ ప్రముఖులతో పాటు కవులు, ఇతర కళాకారులు, సాహితీవేత్తలు, సంగీత దర్శకులు హాజరవుతున్నారు. ఈ మహాసభలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, కాన్ఫరెన్సు కన్వీనర్‌ రవి పొట్లూరి తెలియజేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు