ఎన్టీఆర్‌ మహోన్నత వ్యక్తి.. ఆయన తెలుగుజాతికి గర్వకారణం

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సిడ్నీ నుంచే కాకుండా కాన్బెర్రా, న్యూ క్యాజిల్ నగరాల నుంచి తెలుగువారు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు శివాజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Published : 03 Jun 2023 13:09 IST

సిడ్నీ: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సిడ్నీ నుంచే కాకుండా కాన్బెర్రా, న్యూ క్యాజిల్ నగరాల నుంచి తెలుగువారు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు శివాజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకల్లో అనేక మంది చిన్నారులు, పెద్దలు సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆద్యంతం అలరించారు. ఎన్టీఆర్ జీవిత ముఖ్య ఘట్టాలతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఫొటో ప్రదర్శన, ఆయన నటవిశ్వరూపాన్ని ఆవిష్కరించిన చిత్ర సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ కటౌట్లతో ఏర్పాటు చేసిన ఫొటోబూత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ 2023 సంవత్సరానికి క్లారా చౌ, మురళి సాగిని ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించింది. ఇందులో ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ క్లారా చౌ కార్డియో వాస్క్యూలర్ వ్యాధి నివారణకు విశేష కృషి చేశారు. న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్ర జ్యుడీషరీ కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురళి సాగి ప్రజాసేవ, న్యాయ రంగాల్లో సేవలందించారు. ముఖ్య అతిథి శివాజీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ లాంటి మహోన్నత మనిషి, నిస్వార్థ నాయకుడు యుగానికి ఒక్కరే ఉంటారని, ఆయన తెలుగు జాతికే గర్వకారణమని కొనియాడారు. ఆయన గురించి నేటి తరాలకు తెలియజేస్తూ వివిధ సామజిక కార్యక్రమాలను చేపడుతున్న తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థను ప్రశంసించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు