తానా మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి

తానా మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని  తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు.

Updated : 10 Jun 2023 05:36 IST

ఫిలడెల్ఫియా: ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7,8,9 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభల్లో భాగంగా అందరికీ నచ్చే విధంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రత్యేక ఆకర్షణగా పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా పేరొందిన దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ తనదైన శైలిలో ఆహుతులను అలరించనున్నారు. సంగీత విభావరికి హాజరయ్యేవారు ముందుగా తమ పేరును నమోదు చేసుకోవాలి.

పేర్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని