US Visa Slots: వీసా స్లాట్లు వచ్చాయోచ్!!
విద్యార్థి, పర్యాటక వీసాలతో అమెరికా వెళ్లాలనుకునే వారికి శుభవార్త ఇంటర్వ్యూ తేదీ స్లాట్లు పెద్ద సంఖ్యలో విడుదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు తమ వంతు కోసం చాలా రోజులపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటే... ప్రస్తుతం ఎప్పుడు కావాలంటే అప్పటికి వీసా తేదీలు అందుబాటులోకి వచ్చాయి.
అమెరికా ఆశావహులకు భారీ సంఖ్యలో ఇంటర్వ్యూ తేదీలు
సెప్టెంబరులో పర్యాటక వీసా తేదీలు అందుబాటులో..
ఈనాడు, హైదరాబాద్: విద్యార్థి, పర్యాటక వీసాలతో అమెరికా వెళ్లాలనుకునే వారికి శుభవార్త ఇంటర్వ్యూ తేదీ స్లాట్లు పెద్ద సంఖ్యలో విడుదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు తమ వంతు కోసం చాలా రోజులపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటే... ప్రస్తుతం ఎప్పుడు కావాలంటే అప్పటికి వీసా తేదీలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా ఆశావహులు పర్యాటక వీసా (బీ1/బి2) తేదీల కోసం వేచి చూస్తున్నారు. ఆది, సోమవారాల్లో అమెరికా ప్రభుత్వం రెండు రకాల వీసా స్లాట్లను విడుదల చేసింది. ఏటా ఆగస్టు, సెప్టెంబరులో ప్రారంభమయ్యే విద్యా సీజన్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది విద్యార్థులు అమెరికా వెళుతుంటారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ పరిధిలో విద్యార్థి వీసా తేదీలు ప్రతిసారీ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే భర్తీ అవుతుంటాయి. ఇప్పుడు మాత్రం సాట్లు వచ్చి 24 గంటలు దాటుతున్నా ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. జులై, ఆగస్టు నెలల్లో ఇంటర్వ్యూ తేదీలు సోమవారం రాత్రి కూడా ఖాళీగా ఉన్నాయి. త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం కోసం గత నెల 15న తేదీలను విడుదల చేయగా గంటల వ్యవధిలో అయిపోయాయి. తాజాగా భారీగా విడుదల చేయటంతో ఇప్పటికే అమెరికాలోని విశ్వవిద్యాలయాల నుంచి ఐ-20 తెప్పించుకున్న విద్యార్థులందరూ ఇంటర్వ్యూ స్లాట్లు పొందినట్లు సమాచారం. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలోని కాన్సులేట్ల పరిధిలో గత ఏడాదిలో 1.25 లక్షల మంది విద్యార్థులకు వీసాలు జారీఅయ్యాయి. ఈ ఏడాది విద్యార్థి, పర్యాటక తదితరాలు కలిపి పది లక్షల వీసా దరఖాస్తులను పరిశీలించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రకటించిన విషయం తెలిసిందే.
తిరస్కృతుల ఎదురుచూపులు..
ఒకదఫా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురైన విద్యార్థులు మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకసారి తిరస్కరించినా వెంటనే మరోదఫా స్లాట్ తీసుకుని మరోదఫా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం ఉంది. రెండేళ్ల కిందట అమెరికా ప్రభుత్వం ఆ నిబంధనను సవరించింది. అందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక సీజనులో ఒకసారి మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్థుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో తిరస్కృతుల కోసం ప్రత్యేకంగా మరోదఫా స్లాట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో ఆ అవకాశం లభిస్తుందా? లేదా? అని పలువురు ఎదురుచూస్తున్నారు.
- తొలిసారి అమెరికా వెళ్లాలనుకే వారు ఇటీవల వరకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆది, సోమవారాల్లో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఇంటర్వ్యూలకు సంబంధించిన తేదీలు అందుబాటులోకి వచ్చాయి. గడిచిన నెలలో పరిమిత సంఖ్యలో పర్యాటక వీసాలను అమెరికా విడుదల చేసింది. ఈసారి భారీగానే విడుదల చేసింది. కొంత కాలంగా ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుతం స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Deve Gowda: భాజపా-జేడీఎస్ దోస్తీ.. దేవెగౌడ కీలక వ్యాఖ్యలు
-
Pawan Kalyan: ఆడబిడ్డలపై దురాగతాలు.. ప్రభుత్వానికి స్పందించాల్సిన బాధ్యత లేదా?: పవన్
-
North Korea: ఆ అమెరికా సైనికుడిని వెనక్కు పంపనున్న ఉత్తర కొరియా..!
-
Laddu Auction: గచ్చిబౌలిలో రూ.25.5 లక్షలు పలికిన గణపయ్య లడ్డూ
-
Muttiah Muralitharan: నాని సినిమాలు ఎక్కువగా చూశా: ముత్తయ్య మురళీధరన్
-
Sony earbuds: సోనీ నుంచి ఫ్లాగ్షిప్ ఇయర్‌బడ్స్.. 5జీ స్మార్ట్‌ఫోన్ కంటే ఎక్కువే!