మీ అనుభవం రాష్ట్రానికి అవసరం
‘అభివృద్ధి చెందిన ప్రపంచంలో మీరెన్నో ఏళ్లుగా ఉంటున్నారు. అక్కడ మీరెంతగానో ఎదిగారు. మీకున్న అవగాహన, అనుభవంతో ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడండి’ అని ముఖ్యమంత్రి జగన్ నాటా ప్రతినిధులను కోరారు.
నాటా సభలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ‘అభివృద్ధి చెందిన ప్రపంచంలో మీరెన్నో ఏళ్లుగా ఉంటున్నారు. అక్కడ మీరెంతగానో ఎదిగారు. మీకున్న అవగాహన, అనుభవంతో ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడండి’ అని ముఖ్యమంత్రి జగన్ నాటా ప్రతినిధులను కోరారు. అమెరికాలో నిర్వహిస్తున్న 2023 నాటా సభలను ఉద్దేశించి సోమవారం ఆయన తాడేపల్లి నుంచి వర్చువల్ విధానంలో మాట్లాడారు. ‘ఆర్థికంగా అన్న మాటలు కాస్త ఉపయోగకరంగా ఉంటాయి కానీ.. ఆర్థికంగా అనే మాటను పక్కనపెడితే మీ అనుభవం రాష్ట్రానికి అవసరం. మీరు మన గ్రామాల మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెడితే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. మీ సహాయ సహకారాలు రాష్ట్రానికి కావాలి’ అని కోరారు.
మార్పు సంకేతాలనిస్తున్నాం
‘రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో 11 వైద్య కళాశాలలు ఉండగా, ఇప్పుడు అదనంగా మరో 17 తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగుచోట్ల ఆరు నౌకాశ్రయాలుంటే ఇప్పుడు మరో నాలుగు నిర్మిస్తున్నాం. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమూ కొనసాగుతోంది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక వాడల పనులు జరుగుతుంటే అందులో మూడు మన వద్దే ఉన్నాయి. సులభతర వ్యాపారంలో వరుసగా మూడేళ్ల నుంచి నంబర్ 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రమే నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లోనూ టాప్ 4, 5 రాష్ట్రాల్లో ఒకటిగా మనం ఉన్నాం. మన ప్రభుత్వం సామాజిక న్యాయం, పరిపాలనా సంస్కరణలు, వికేంద్రీకరణ, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా ప్రతి విషయంలో దేశంలోనే గొప్ప మార్పు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతోందనే సంకేతాలు ఇవ్వగలుతున్నాం’ అని సీఎం చెప్పారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
‘నాటా కార్యవర్గానికి నా శుభాకాంక్షలు. మీరంతా అక్కడ వివిధ రంగాల్లో రాణిస్తున్న తీరు చూసి మేమంతా గర్వపడుతున్నాం. మీలాగే కమిట్‌మెంట్, ఫోకస్ మన రాష్ట్రంలో ఉన్న పిల్లల్లో ఉండడాన్ని నేను చూశా. వారు ఎదిగేందుకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని ఈ నాలుగేళ్లలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు నాడు-నేడుతో మారుతున్నాయి. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్లుగా ఎదిగేందుకు ఆంగ్లం ఒక గొప్ప సాధనం. ఆంగ్ల మాధ్యమ బడులతో పిల్లల్లో ఇంగ్లిష్ భాష పునాదిని గట్టి పరుస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో 3 నుంచి 10 వరకు ప్రాథమిక, జూనియర్ విభాగాలుగా టోఫెల్ శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేశాం. వచ్చే ఏడాది ఇంటర్‌లో సీనియర్ అనేది ప్రారంభిస్తాం’ అని సీఎం వివరించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మనం రాష్ట్రంలో చేపట్టిన పనులు రాబోయే రోజుల్లో అందరికీ దిక్సూచి అవుతాయి. రాబోయే రోజుల్లో సూక్ష్మ వ్యవసాయం(ప్రిసిషెన్ అగ్రికల్చర్) అనేది వ్యవసాయ రంగంలో జరగబోయే గొప్ప మార్పు. ఈ సూక్ష్మ వ్యవసాయానికి మొట్టమొదటి బీజం మన రాష్ట్రం నుంచే గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలతో పడింది’ అని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తవగానే.. అక్కడ నాటా సభ వేదికపై ప్రతినిధులు జై జగన్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైనాట్ 125 అని ఒకరు అనగా.. పక్కనున్నవారు సర్దిచెప్పి వై నాట్ 175 అంటూ నినదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత