తానా మహాసభల్లో తెలుగు వైభవం
అమెరికాలో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ మహాసభల్లో రెండో రోజైన శనివారం సాంస్కృతిక శోభ వికసించింది. ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహిస్తున్న వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభోపన్యాసం చేశారు.
మాతృ భాష పరిరక్షణలో సంఘం కృషి ప్రశంసనీయం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఈనాడు, అమరావతి: అమెరికాలో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ మహాసభల్లో రెండో రోజైన శనివారం సాంస్కృతిక శోభ వికసించింది. ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహిస్తున్న వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగు గొప్పదనం, భాషను కాపాడటంలో సంఘం కృషిని ప్రశంసించారు. అనంతరం తానా ప్రతినిధులు వెంకయ్యనాయుడిని ఘనంగా సత్కరించారు. ఆధ్యాత్మిక జీవితంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రసంగించారు. రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరశాస్త్రి రచించిన ‘తెలుగువైభవం’ పాటకు స్థానిక నృత్య పాఠశాల విద్యార్థులు నాట్యం చేశారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోకు అధిక స్పందన లభించింది. కృష్ణుడి రూపంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్, సినీ గేయరచయిత చంద్రబోస్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, ప్రైమ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ (టాటా) వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి తదితరులను సత్కరించారు. కన్వెన్షన్ కేంద్రంలో ఏర్పాటుచేసిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ సమన్వయకర్త రవి పొట్లూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ బండ్ల హనుమయ్య తదితరులు ప్రసంగించారు. సినీ సంగీతదర్శకుడు దేవీశ్రీప్రసాద్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కచేరీ అలరించింది. ఉత్సవాల్లో జై అమరావతి నినాదం ప్రతిధ్వనించింది. వేడుకలకు హాజరైన పలువురు ప్రతినిధులు ‘జై అమరావతి.. జై జై అమరావతి’ అని నినాదాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్