తానా మహాసభల్లో అమరావతి రైతుల ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు

ఫిలడెల్ఫియా నగరంలో నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల్లో అమరావతి బహుజన ఐకాస ప్రత్యేకంగా స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

Published : 13 Jul 2023 23:18 IST

అమెరికా: ఫిలడెల్ఫియా నగరంలో నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)23వ మహాసభల్లో అమరావతి బహుజన ఐకాస ప్రత్యేకంగా స్టాల్‌ను ఏర్పాటు చేసింది. స్టాల్‌లో భాగంగా అమరావతి రైతులు చేస్తున్న రాజధాని ఉద్యమాన్ని.. దళితులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలను సంబంధించిన వివరాలను ప్రదర్శించారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు చికాగోకు చెందిన యలమంచిలి ప్రసాద్, వేనుగుంట రాజేష్, తదితర ఎన్ఆర్‌ఐ మిత్రులకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు