హ్యూస్టన్‌లో శ్రీవారి కల్యాణోత్సవం

తితిదే ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఆదివారం శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Updated : 17 Jul 2023 06:48 IST

కంకిపాడు, న్యూస్‌టుడే: తితిదే ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఆదివారం శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన తదితర పూజలను అర్చకుడు శ్రీధర్‌ పర్యవేక్షించారు. దేశ, విదేశాలకు చెందిన 21 విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాల విద్యార్థులు, గాయకులు, నృత్య కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వామివారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు బారులుతీరారు. తెలుగు రుచులతో అన్న సంతర్పణ చేశారు. తితిదే ఏఈవో వెంకటేశ్వర్లు, తెలుగు, కన్నడ, తమిళ సంఘాలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్సవ నిర్వహణ కమిటీ ప్రతినిధులు సీహెచ్‌.మారుతీరెడ్డి, జి.శ్రీనివాస్‌, జి.రవి, ఎస్‌.మహేశ్వరరావు, బి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌.దుర్గాప్రసాద్‌ పర్యవేక్షించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు