న్యూజెర్సీలో ఘ‌నంగా బోనాల జాత‌ర‌

తెలంగాణ సంస్కృతి, ఆచార సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల జాతరను అమెరికాలోనూ ప్రవాసభారతీయులు వేడుకగా నిర్వహించుకున్నారు.

Updated : 18 Jul 2023 00:01 IST

న్యూజెర్సీ: తెలంగాణ సంస్కృతి, ఆచార సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల జాతరను అమెరికాలోనూ ప్ర‌వాస భారతీయులు ఘ‌నంగా నిర్వహించారు. ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (మాట), సాయి దత్త పీఠం శ్రీశివ విష్ణు దేవాలయం సంయుక్త ఆధర్వర్యంలో బోనాల జాతరను నిర్వహించారు. హైద‌రాబాద్‌ లాల్‌ దర్వాజ, లష్కర్‌ బోనాలను మరిపించే విధంగా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో పోతురాజులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాసీయులు భారీ సంఖ్య‌లో పాల్గొని పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఎడిసన్ ప్రాంతంలోని తెలుగు ఆడపడుచులు బోనమెత్తారు. అమ్మవారిని మేళతాళలతో ఘనంగా స్వాగతించారు. తెలంగాణ, అమెరికాలోని ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. సాయిద‌త్తపీఠం ఛైర్మన్‌ ర‌ఘుశ‌ర్మ శంక‌ర‌మంచి పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ‘మాట’ అధ్యక్షుడు శ్రీనివాస గనగోని అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇక ముందూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయబోతున్న‌ట్టు తెలిపారు. కార్య‌క్ర‌మంలో కిరణ్ దుద్దగి, విజయ్ భాస్కర్ కలాల్, శ్రీధర్ గుడాల, దాము గేదెల, జైదీప్ రెడ్డి, కృష్ణశ్రీ గంధం, మహేందర్ నరలా, వెంకీ మస్తీ, కృష్ణ సిద్ధదా, రంగారావు మాడిశెట్టి, గిరిజా మాదాసి, మహిపాల్ రెడ్డి, రాకేష్ కస్తూరి, ప్రభాకర్, పూర్ణ, అశోక్ చింతకుంట, మాధవి సోలేటి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని