లండన్‌లో NRI TDP ఎన్నికల సన్నాహక సమావేశం
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయి.. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడంలో ఎన్నారైల పాత్ర మీద చర్చించేందుకు.. ఎన్నారై తెదేపా ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
లండన్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయి.. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడంలో ఎన్నారైల పాత్ర మీద చర్చించేందుకు.. ఎన్నారై తెదేపా ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నారై తెదేపా యూకే కౌన్సిల్ ఆధ్వర్యంలో లండన్ వేదికగా జరిగిన మేధోమథన సదస్సుకు యూకే వ్యాప్తంగా వున్న NRI TDP కార్యవర్గ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై తెదేపా విభాగం అధిపతి రవి వేమూరు.. శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ విశేషంగా ఆకట్టుకుంది.. UK/Europe వ్యాప్తంగా ఎన్నారై తెదేపాను బలోపేతం చేయటం.. ఇక్కడి ఎన్నారైల సేవలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఎలా వినియోగించుకోబోతుంది.. పార్టీలో ఎన్నారైల పాత్ర.. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నారైలకు భాగస్వామ్యంతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదులోనూ NRI TDP ఏ విధంగా పార్టీకి అదనపు బలంగా నిలుస్తుందో వివరిస్తూ ఇచ్చిన ప్రజంటేషన్ ఎన్నారైలలో మరింత ఉత్సుకత పెంచింది.
తెలుగుదేశం పార్టీకి ఎన్నారైలకు అవినాభావ సమబంధం ఉందని.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ NRIలకు పెద్దపీట వేయటంతో పాటుగా పార్టీ మేనిఫెస్టోలో NRIల హక్కులు, వాళ్ల ఆస్తుల సంరక్షణకు అవసరమైన ప్రణాళికలు పొందుపరుస్తున్నామని.. దేశ GDPలో Forex Reserves పాత్ర, అందులో NRIల Remittenceదే అగ్రభాగం అని దానిని మరింత సరళీకృతం చేసేలా ఎన్నారై చట్టాలకు మరింత పదును పెట్టేలా కృషి చేస్తామని సదస్సు తీర్మానించింది.
ఈ సందర్భంగా ఎన్నారై తెదేపా కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయం చేసుకుంటూ స్థానిక నాయకత్వంతో అనుసంధనమవుతూ పార్టీ ప్రచార కార్యక్రమాన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవటంపై చర్చ జరిగింది. ఓటు హక్కు విశిష్టత గురుంచి యువతలో చైతన్యం తెస్తూ, ప్రతి అభిమానిని పోలింగ్ బూతు వైపుగా నడపటంలో పోషించాల్సిన పాత్ర మీద కూడా చర్చించారు. అన్నగారి ఆశయాల సాధన కోసం, చంద్రన్న నాయకత్వాన్ని బలోపేతం చేయటం కోసం యువగళం ద్వారా నారా లోకేశ్ ప్రజల్లో తెస్తున్న చైతన్యం.. పార్టీకి వస్తున్న ఆదరణని సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని సమావేశం నిర్ణయించింది.
NRI TDP UK అధ్యక్షుడు వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గుంటుపల్లి రామారావు, యూకే తెదేపా కార్యవర్గ సభ్యులు గుంటుపల్లి జయకుమార్, ప్రసన్న నాదెండ్ల , చక్రి మొవ్వ , కిరణ్ పరుచూరి, పాలడుగు శ్రీనివాస్, నరేశ్ మలినేని, నవీన్ జవ్వాడి, అమర్ మన్నే , రామకృష్ణ రిమ్మలపూడి, శివరాం కూరపాటి, అనిల్ పచ్చా, శ్రీధర్ నారా, శ్రీపతి సరిపూటి, నాగ్ దివి, వినయ్ కామినేని, రవికాంత్ కోనేరు, శ్రీధర్ బెల్లం తదితరులతోపాటు యూకే తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్‌లో లులు మాల్
-
‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం