కెనడా హాలిఫాక్స్‌లో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు

పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు..  మేము ఎక్కడ ఉంటే అక్కడే  పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా చాటుతున్నారు కెనడాలోని మన భారతీయులు. ముఖ్యంగా మన తెలుగు వారు. హాలిఫాక్స్‌లో నోవా మల్టీఫెస్ట్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Updated : 04 Aug 2023 12:55 IST

కెనడా: పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు..  మేము ఎక్కడ ఉంటే అక్కడే  పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా చాటుతున్నారు కెనడాలోని మన భారతీయులు. ముఖ్యంగా మన తెలుగు వారు. హాలిఫాక్స్‌లో నోవా మల్టీఫెస్ట్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

విశాల్ భరద్వాజ్, ఆయన బృందం భ్యారి, టీనా, సెలెస్ట్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. కెనడా ఎన్‌ఎస్‌ లీడర్, యార్మౌత్ ఎమ్మెల్యే జాక్ చర్చిల్, ఎన్‌డీపీ లీడర్ క్లాజుడై చందర్, క్లేటొన్ పార్క్ ఎమ్మెల్యే రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసి నోవా మల్టీఫెస్ట్ సంబరాలను ప్రారంభించారు. ఈ వేడుకలకు సుమారు 8000 మంది హాజరయ్యారు. హరి చల్లా మన దేశం/రాష్ట్రం తరఫున కార్యకలాపాలు నిర్వహించారు.  హరి బృందం, ఫణి వంక, శివ మారెళ్ల, చంద్రా తాడేపల్లి, వెంకట్ వేలూరి, శ్రీనివాస చిన్ని, పృథ్వీ కాకూరు, కృష్ణవేణి, రత్నం, జయ, ప్రియాంక, లావణ్య, శ్రీలేఖ, జనని కృష్ణ్ణ, జ్యోత్స్న శ్రీజ, దీపీకా కర్ణం, జయశ్రీ కర్ణం, సియ శ్రీ  శివకుమార్, రిషిన్త్ శివకుమార్, శిబి నాన్తం ఆట్రియం, రోహిత్ సాయి చల్లా  పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కెనడాలో హాలిఫాక్స్ నగరంలో జరిగిన "నోవా మల్టీఫెస్ట్" సంబరాలలో మన తెలుగు వారు, ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు, వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకు వివరించారు.

వాతావరణం అనుకూలించక నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగినప్పటికీ.. 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం. వివిధ భాషలు, వివిధ సంస్కృతుల నివాసమైన కెనడా వాసులు మన పండుగలు విశేషాలను బాగా అర్థం చేసుకొని, అభినందించారు.

కెనడా హాలిఫాక్స్‌- సుప్రజ మాట్లాడుతూ.. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ మన సంస్కృతి గురించి గొప్పగా చెప్పారు. ఇక  భరతనాట్యం (జనని కృష్ణ్ణ), కూచిపూడి (జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము (శిబి నాన్తం ఆట్రియం), జానపద నృత్యా (దీపీకా కర్ణం, జయశ్రీ కర్ణం )లతో కెనడా ప్రజలను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు