సింగపూర్‌ నేషనల్‌డే పరేడ్‌లో పాల్గొననున్న హైదరాబాద్‌ వాసి

సింగపూర్‌ నేషనల్‌ డే పరేడ్‌ 2023 వేడుకల్లో పాల్గొనే అవకాశం ఓ ప్రవాసునికి దక్కింది.

Published : 05 Aug 2023 10:36 IST

సింగపూర్‌ నేషనల్‌ డే పరేడ్‌ 2023 వేడుకల్లో పాల్గొనే అవకాశం ఓ ప్రవాసునికి దక్కింది. హైదరాబాద్‌కు చెందిన మాధవరావు ఆగస్టు 9న జరిగే సింగపూర్‌ నేషనల్‌ డే పరేడ్‌లో OneTeam SG మార్చింగ్‌ కంటింగ్‌జెంట్‌ సభ్యుడిగా ఉండనున్నాడు. ఈ అవకాశం లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇందు కోసం ఏప్రిల్‌ నుంచి ప్రతి శనివారం శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. మార్చ్‌ పాస్ట్‌, డ్రిల్స్‌ పట్ల తన అభిరుచి ఈ ప్రయాణాన్ని కొనసాగించడంలో సహాయపడిందని చెప్పారు. ఈ అవకాశం కల్పించినందకు టీమ్‌ నీలా, OneTeam SGకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు