మిల్పిటాస్‌లో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవం
సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవాన్ని ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో వేడుకగా నిర్వహించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
ఈనాడు, అమరావతి: సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవాన్ని ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో వేడుకగా నిర్వహించారు. కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో ‘శ్రీనాథుడు’ తెలుగు పద్య నాటకం ప్రదర్శించారు. గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథుడి పాత్రను, సిలికానాంధ్ర కుటుంబసభ్యులు మిగిలిన పాత్రలు పోషించారు. లకిరెడ్డి హనిమిరెడ్డి గుమ్మడి గోపాలకృష్ణను సత్కరించి, పదివేల డాలర్ల బహుమతి ప్రకటించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, వైస్‌ఛైర్మన్ దిలీప్ కొండిపర్తి, మాజీ అధ్యక్షులు సంజీవ్ తనుగుల, విజయసారథి మాడభూషి, ప్రస్తుత కార్యవర్గ నాయకులు కిరణ్ సింహాద్రి, సాయి కందుల, శివ పరిమి, పూర్వ కార్యవర్గ సభ్యులు శాంతివర్ధన్ అయ్యగారి, ప్రియ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, వంశీ నాదెళ్ల, బే ఏరియా తెలుగువారు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బూదరాజు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా ఒక పద్య నాటకాన్ని చూడలేదని, అమెరికాకు వచ్చి ఇక్కడ ఇలా సిలికానాంధ్ర సంస్థలో చూడగలగడం తన అదృష్టమని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర తెలుగు శాఖలో వచ్చే సంవత్సరం నుంచి సిరివెన్నెల ఆచార్య పీఠం ప్రారంభిస్తున్నట్లు సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, వారి సోదరుల సమక్షంలో కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్‌ణీతి’.. లీలా ప్యాలెస్‌లో వైభవంగా వివాహం