దక్షిణాఫ్రికాలో భారత స్వాతంత్య్ర దినోత్సవం

దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రవాస భారతీయులు శనివారం భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌  స్టేడియంలో జరిగిన ఉత్సవాల్లో దక్షిణాఫ్రికా తెలంగాణ సంఘం (టాసా) ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మలతో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Updated : 13 Aug 2023 06:37 IST

దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రవాస భారతీయులు శనివారం భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌  స్టేడియంలో జరిగిన ఉత్సవాల్లో దక్షిణాఫ్రికా తెలంగాణ సంఘం (టాసా) ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మలతో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మ ఆటలతో పాటు రాష్ట్ర సంస్కృతీసంప్రదాయలు ఉట్టిపడేలా ప్రదర్శనలను నిర్వహించారు. టాసా అధ్యక్షుడు తాళ్లూరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో శ్రేయ బండారు, ప్రియాంక గుర్రాల, లక్ష్మి కుప్పు, తేజ, కవిత అప్పం తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.

 ఈనాడు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు