శ్రీవాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం
ఐర్లాండ్ డబ్లిన్ నగరంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆనందదాయకంగా జరిగింది. సెయింట్ కాథరిన్ పార్క్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఐర్లాండ్ డబ్లిన్ నగరంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆనందదాయకంగా జరిగింది. సెయింట్ కాథరిన్ పార్క్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ అనూష పులవర్తి, చిన్నారి లక్ష్మి హాసిని భక్తి గీతాలు అందర్నీ అలరించాయి. ప్రముఖ రేడియో జాకీ అంకిత పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు పద్యాలు, శ్లోకాలు, తెలుగు భాష ప్రావీణ్యం, సంప్రదాయ దుస్తులు తదితర పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అక్షద, చరిత, హాసిని, నీల్ అన్వయి, యజ్నశ్రీ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల ఆటలు అందర్నీ అలరించాయి.
దివ్య మంజుల పర్యవేక్షణలో నిర్వహించిన ‘కుటుంబ అన్యోన్యత’ ఆటలో భాస్కర్ బొగ్గవరపు దంపతులు మొదటి బహుమతి అందుకొన్నారు. సంప్రదాయ వస్త్రధారణ పోటీలో గ్రంథి మణి, లావణ్య దంపతులు విజయం సాధించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మహిళలందరికీ ప్రత్యేక చిరు కానుకలు అందించారు. సంతోష్, మహేష్ అలిమెల్ల, గిరిధర్, శ్రీనివాస్, రామ మణికంఠ, అన్వేష్‌ల సహకారంతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో ఆస్వాదించారు.
కార్యక్రమం విజయవంతమవడానికి వీరమల్లు కళ్యాణ్, అనిత, మాధవి, హిమబిందు, దివ్య మంజుల, లావణ్య, గిరిధర్ మరియు సతీష్ మేడా తదితరులు తమ వంతు కృషి చేశారు. చివరిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరేంద్ర కుమార్ నారంశెట్టి పురాణాల్లో ఆర్యవైశ్యుల విశిష్టతను వివరించారు. అమ్మవారు నేర్పిన ధర్మ కార్యాలు ప్రతి కుటుంబం ఆచరించాలని అన్నారు. ఈ కార్యక్రమం స్పాన్సర్స్‌గా వ్యవహరించిన southern spice రెస్టారంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల
-
UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా!
-
Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
India Canada Row: ‘భారత్-కెనడా వివాదం.. అమెరికా తలదూర్చకపోవచ్చు’
-
Chandrababu: రెండోరోజు కొనసాగుతున్న చంద్రబాబు సీఐడీ విచారణ