సాయి దత్త పీఠం శివ విష్ణు దేవాలయంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని విదేశాల్లో కూడా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల‌ను అమెరికాలో ప్రవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు.

Updated : 16 Aug 2023 11:03 IST

ఎడిసన్: 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని విదేశాల్లో కూడా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల‌ను అమెరికాలో ప్రవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు.

న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ ఓక్ ట్రీ రోడ్‌లో ఉన్న సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక‌ల్లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ మాన్ అజయ్ పాటిల్, కమిషనర్ ఉపేంద్ర చివుకుల, మాజీ ఆర్మీ అధికారులు, రోజా శంకరమంచి, UBLOOD ఫౌండర్ డాక్టర్ జగదీశ్ యలమంచిలి టీం,  ఏపీ భాజపా సెక్రటరీ పాతూరి నాగ భూషణం, కృష్ణారెడ్డి , డాక్టర్ జనార్దన్ బొల్లు , డాక్టర్ అనీష్ , ప్రదీప్ కొఠారి, రాజీవ్ బాంబ్రీ, మాటా అధ్యక్షులు శ్రీనివాస్ గనగోని, ఆటా సభ్యులు విలాస్ జంబుల, TFAS అధ్యక్షులు మధు రాచకుళ్ల,  TTA సభ్యులు, దీపిక (వాస్తు), సాయి దత్త పీఠం డైరెక్టర్లు ,వలంటీర్లు మువ్వన్నెల జెండాను చేతబ‌ట్టి వందేమాతరం, భారతమాత కీ జై అంటూ నినాదాలు చేశారు.

అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఎడిసన్ అని, భారతదేశం గర్వపడే పనులు ప్రవాసులు చేయాలని స్థానిక‌ మేయర్ సామ్ జోషి పిలుపునిచ్చారు. ఇది అత్యంత భావోద్వేగ క్షణం అంటూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఫౌండర్ రఘుశర్మ శంకరమంచి మాట్లాడుతూ.. భారతమాత బానిస సంకెళ్లను తొలగించుకుని స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న ఈ శుభదినాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా దేవాలయ ప్రాంగణంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సంద‌ర్భంగా భార‌తీయులంద‌రికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు