సీపీఆర్‌పై ‘తానా’ సారథ్యంలో అవగాహన కార్యక్రమాలు

ఇటీవలికాలంలో గుండెపోటుతో అనేకమంది ఆకస్మికంగా మరణిస్తున్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో వెంటనే సీపీఆర్‌ తదితర ఉపశమన చర్యలు చేపట్టడం ద్వారా  బాధితులను రక్షించే అవకాశముంది.

Published : 28 Aug 2023 14:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవలికాలంలో గుండెపోటుతో అనేకమంది ఆకస్మికంగా మరణిస్తున్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో వెంటనే సీపీఆర్‌ తదితర ఉపశమన చర్యలు చేపట్టడం ద్వారా  బాధితులను రక్షించే అవకాశముంది. ఉత్తర అమెరికా తెలుగుసంఘం ‘తానా’ సారథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు పాఠశాలల్లో సీపీఆర్‌, ఏఈడీ శిక్షణ కార్యక్రమాలను ఆగస్టు 26 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కల్లా 100 పాఠశాలల్లో నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు  ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి,  తానా  అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు వెల్లడించారు.

గుంటూరులోని ఏడు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో తానా ఫౌండేషన్‌ ట్రస్టీ శ్రీనివాస్‌ ఎండూరి,  తానా న్యూఇంగ్లాండ్‌ ఆర్‌ ఆర్‌ కృష్ణ ప్రసాద్‌ సోంపల్లి,  డాక్టర్‌ ఓకే మూర్తి,  ఎన్నారైలు సూర్య తెలప్రోలు, దగ్గుబాటి సురేష్‌,  పాఠశాల కరస్పాండెంట్‌ పాటిబండ్ల విష్ణువర్ధన్‌, టోబాకోబోర్డునకు చెందిన జీవీఆర్‌, ప్రిన్సిపాల్‌ షఫీ...తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని