వరంగల్ యువకుడికి సింగపూర్ తెలుగు సమాజం అభినందనలు
ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలన్నది ఆ యువకుడి ఆలోచన. అలాగే రోగ నిరోధక శక్తిని బలహీనపరిచే కాలుష్యాన్ని తగ్గించాలన్నది అతడి సంకల్పం.
సింగపూర్: ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలన్నది ఆ యువకుడి ఆలోచన. అలాగే రోగ నిరోధక శక్తిని బలహీనపరిచే కాలుష్యాన్ని తగ్గించాలన్నది అతడి సంకల్పం. అందుకోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైక్లింగే ఉత్తమ మార్గమని నమ్మాడు. అనుకున్నదే తడువుగా సైకిల్‌పై ప్రపంచ యాత్ర చేపట్టాడు తెలంగాణలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్. 2021 ఏప్రిల్ 5న మొదలైన అతడి యాత్ర భారత్ దాటి ఆసియా ఖండంలోని వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా దేశాలను చుట్టిసేంది. ఈ ఏడాది ఆగస్టు 29న సింగపూర్‌కు చేరుకుంది.
ఈ నేపథ్యంలో మంచి సంకల్పంతో రంజిత్ చేస్తున్న ఈ యాత్రకు సింగపూర్ తెలుగు సమాజం ఆతిథ్యం ఇచ్చింది. రంజిత్ చేస్తున్న కృషిని కమిటీ అభినందించి సత్కరించింది. ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటని, దీంతో మానవాళి రోగనిరోధక సన్నగిల్లితుందన్నారు. ప్రజలంతా కనీసం వారంలో ఒక్కరోజైనా సైక్లింగ్ చేయాలని సూచించారు. సైక్లింగ్‌తో పర్యావరణం మెరుగుపడటంతో పాటు శారీరకంగా దృఢంగా ఉంటామన్నారు.
ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం వారికి రంజిత్ ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ చాలా బాగుందని ఇక్కడ పచ్చని చెట్లు అధికంగా ఉన్నాయన్నారు. రెండు రోజుల్లో సింగపూర్ నుంచి ఇండోనేసియాలోని జకార్తాకు, తరువాత ఫిలిప్పీన్స్, ఇతర దేశాల గుండా ఆస్ట్రేలియా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేయాలని ప్రణాళిక చేసుకున్నట్లు చెప్పారు. తాను ఇప్పటివరకూ సైకిల్‌పై 22,300 కి.మీ ప్రయాణించినట్లు పేర్కొన్నారు. తన ప్రయాణ విశేషాలను ‘రంజిత్ ఆన్ వీల్స్’ ఇన్‌స్టా, ఫేస్‌బుక్ పేజీలో పంచుకుంటున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
నీళ్లు లేకుండానే పంట..
-
2 నిమిషాల్లోనే 50 మ్యాథ్స్ క్యూబ్‌లు చెప్పేస్తున్న బాలిక..
-
TS TET Results: టెట్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్‌లో..
-
ఎఫ్ఐఆర్లో మొదట చంద్రబాబు పేరు లేదని విన్నా..: కేంద్ర మంత్రి నారాయణస్వామి
-
భర్త బాధలను చెప్పడమే.. భువనేశ్వరి తప్పా?
-
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో డూప్లికేట్, ఒరిజినల్ అనేవి ఉండవు