అక్రమ అరెస్టులతో మా నాయకుడిని భయపెట్టలేరు
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు సిడ్నీ నగరంలో ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
సిడ్నీ: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు సిడ్నీ నగరంలో ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు 45 ఏళ్ల పాటు మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడిపారని వారు తెలిపారు. తెదేపాకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్ మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల అవినీతి కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ అందరూ తనలాంటి వారే అన్న భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. అక్రమ కేసులు, అరెస్టులతో తమ నాయకుడిని, పార్టీ కార్యకర్తలను భయపెట్టలేరని తెలిపారు. దీనికి తగిన సమాధానం రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం