చంద్రబాబు అక్రమ అరెస్టు తగదు.. మెల్‌బోర్న్‌లో తెదేపా-జనసేన ర్యాలీ

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆదివారం ప్రెసిడెంట్ పార్కు, వింధంవేల్‌ మెల్‌బోర్న్‌లో తెదేపా భారీ ర్యాలీ నిర్వహించింది.

Updated : 17 Sep 2023 22:55 IST

మెల్‌బోర్న్‌ : తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆదివారం ఆస్ట్రేలియాలోని ప్రెసిడెంట్ పార్కు, వింధంవేల్‌ మెల్‌బోర్న్‌లో తెదేపా భారీ ర్యాలీ నిర్వహించింది. చంద్రబాబును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని నినదిస్తూ సుమారు 400 మంది అభిమానులు, కార్యకర్తలు ధర్నా చేశారు. తొలుత దాదాపు 400 కార్లతో.. తెలుగుదేశం, జనసేన జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడారు. అక్రమ అరెస్టులను ఏమాత్రం సహించేది లేదని చెప్పారు. ఈ అరెస్టుల వెనుక ఉన్న వ్యక్తులకు ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. ఈ ధర్నాలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్ల ర్యాలీ అనంతరం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో తెదేపా నాయకులు ఆలపాటి రాజా, జీవీ ఆంజనేయులు, నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇలాగే పోరాటాలను ఉద్ధృతం చేసి రాబోయే ఎన్నికల్లో తెదేపాను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని లగడపాటి సుబ్బారావు తన సహచర బృందంతో కలిసి పర్యవేక్షించారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని