చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన కాకతీయ సాంస్కృతికి పరివారం సింగపూర్‌

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తమను దిగ్బ్రాంతికి గురిచేసిందని కాకతీయ సాంస్కృతికి పరివారం సింగపూరు తెలిపింది.

Published : 18 Sep 2023 16:34 IST

సింగపూర్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని కాకతీయ సాంస్కృతికి పరివారం సింగపూర్‌ పేర్కొంది. సంస్థ మూడో వార్షిక సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన ప్రేరణతోనే ఎంతోమంది సామాన్యులు ఐటీ రంగంలోకి వచ్చారని అన్నారు. అంతేకాదు, వేల మంది ఐటీ నిపుణులు విదేశాలలో స్థిరపడి మంచి జీవనం గడుపుతూ సమాజానికి తమ వంతు సేవ చేస్తున్నారని అన్నారు. ఆయన దార్శనికత వల్లే తెలుగు వారంటే ప్రపంచ పటంలో ముఖ్యంగా ఐటీ రంగంలో మంచి గుర్తింపు పొందారని తెలియచేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ సంస్థ తరపున తమ సంఘీభావం తెలియజేస్తున్నామని కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూర్‌ అధ్యక్షులు పాతూరి రాంబాబు, కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు