సింగపూర్‌లో శాస్త్రోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం

‘లోకాసమస్త సుఖినో భవంతు’ అన్న మహా సత్సంకల్పంతో మన రుషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ముఖ్యఉద్దేశంతో సింగపూర్‌లో నివసించే తెలుగు బ్రాహ్మణులు ఒక సమూహంగా ఏర్పడి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Published : 18 Sep 2023 17:04 IST

‘లోకాసమస్త సుఖినో భవంతు’ అన్న మహా సత్సంకల్పంతో మన రుషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ముఖ్యఉద్దేశంతో సింగపూర్‌లో నివసించే తెలుగు బ్రాహ్మణులు ఒక సమూహంగా ఏర్పడి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిత్య సంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో సెప్టెంబరు 16న ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 40 మందికి పైగా రుత్వికులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, సౌందర్య లహరి పఠించారు. లింగాష్టక పఠనం, హారతితో పరమశివుడిని ఆరాధించారు. కార్యక్రమానికి విచ్చేసిన మహిళలు అందరు చక్కని సమన్వయంతో తీర్థ, ప్రసాదాలు, తెలుగు సంప్రదాయ ప్రసాద విందుని ఏర్పాటు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని