కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్‌

ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated : 22 Jun 2024 14:06 IST

ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెదేపా టంపా టీమ్ సభ్యులు, జనసేన, భాజపా నేతలు హాజరయ్యారు. గత ఎన్నికల్లో ఎన్నారైల పాత్ర, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ మరో బిహార్‌ కాకుండా ఎన్నారైలు తమ మద్దతు కొనసాగించారని  ప్రస్తావించారు. ఇది అద్భుతమైన విజయమని కొనియాడారు. ఈ విజయం కేవలం ఎలక్షన్ వ్యూహం పలితం మాత్రమే కాదని.. మనపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి సాక్ష్యమని పేర్కొన్నారు.

సమావేశానికి కాళహస్తి సత్యనారాయణ, ఆంధ్ర ప్రదేశ్ రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. గొప్ప అధికారంతో గొప్ప బాధ్యత వస్తుందని.. మనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ శుభ సందర్భాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు.

ఎన్నారై తెదేపా టంపా టీమ్ నిర్వహించిన ఈ వేడుకలు విజయవంతం కావడానికి ఆర్థిక సహాయం అందించిన శ్రీనివాస్ గుత్తికొండ, మనుబిక్కసాని, అశోక్ యార్లగడ్డ, ప్రసాద్ ఆరికట్ల, శ్రీకాంత్ కనకమేడల, నరేష్ పాలడుగు, సుబ్బారావు జంపాల, కిరణ్ పొన్నం, అభయ్ ముప్పవరపు, శ్రీమంత్ మద్దిపట్ల, సతీష్ రామినేని, వీరాంజనేయులు నాగుల్, బాల నేమాని, శేఖర్ నేమాని, సతీష్ కడియాల, రంజిత్ పాలెంపాటి, రాజ్ పోపూరి, రామ్ పాలెం, వెంకట్ నెక్కంటి, రాజ్ కాళహస్తి, శ్రీధర్ కొత్తపల్లి, వేణు నిమ్మగడ్డ, నరసింహ నెలూరి, వీర జంపని, లీలాధర్ తాతినేని, ప్రవీణ్ వాసిరెడ్డి, శివ చెన్నుపాటి, రమేష్ దద్దాల, సిద్దయ్య తోట, సందీప్ కొల్లూరి, రావు చాపలమడుగు, దేవేంద్ర కొమ్మినేని తదితరులు కీలక పాత్ర పోషించారు. ఫుడ్ స్పాన్సర్ Tazzamartకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకల కోసం తమ వంతు సహకారాన్ని అందించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్ సుధాకర్ మున్నంగి, సుమంత్ రామినేని , శ్రీనివాస్ మల్లాది రామ్మోహన్ కర్పూరపు, స్వరూప్ అంచె, చంద్ర పెద్దు అజయ్ దండముడి, జనసేన సభ్యులు సునీల్ ఆరాణి, దిలీప్ వాసా, గంగాధర్, రమేష్ పులస, గోపీచంద్, రాజ్ అన్నే, మన్సూర్, వరుణ్, అనంత్ కుమార్, రాజేష్ యమసాని, భాజపా సభ్యులు పవన్ నర్రావుల తదితరులకు ఎన్నారై తెదేపా టంపా టీమ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. వాలంటీర్లందరూ చక్కటి ప్రణాళికతో వేడుకలు విజయవంతం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని