మౌంటైన్ హౌస్‌లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది.

Updated : 25 Jun 2024 13:12 IST

మౌంటైన్‌హౌస్‌: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాలిఫోర్నియా రాష్ట్ర నగరమైన మౌంటైన్‌హౌస్‌లోని ఎన్నారై తెదేపా, జనసేన, భాజపా నాయకులు విజయోత్సవ వేడుకలను జూన్ 23న ఘనంగా నిర్వహించారు.

ఎన్నారై తెలుగుదేశం అధ్యక్షుడు కోమటి జయరాం పర్యవేక్షణలో స్థానిక నేతలు శ్రీకాంత్ దొడ్డపనేని, భక్తా బల్లా, చంద్ర గుంటుపల్లి, వెంకట్ అడుసుమల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా కూటమి అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. హాన్సెన్ పాఠశాల ప్రాంగణం నుంచి 100కు పైగా కార్లతో భారీ ఊరేగింపుగా సమావేశ స్థలానికి ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా పతాకాలతో అలంకరించిన కార్లతో 8 మైళ్ల మేర కోలాహలంగా సాగిన ఈ ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

ఎన్నారై తెలుగుదేశం అధ్యక్షుడు కోమటి జయరాం, ప్రముఖ సినీ నటుడు శివాజీ, తెలుగుదేశం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు తమ మూలాలు మర్చిపోకుండా రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి చేసిన కృషిని అభినందించారు. సభకు హాజరైన కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరాం.. ఎన్టీఆర్‌ ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్ర పురోగతికి దోహదం చేస్తాయని వివరించారు.

ఈ కార్యక్రమాన్ని శశి దొప్పలపూడి, శ్రీనివాస్ తాడపనేని, శ్రీహర్ష యడ్లపాటి, వెంకట్ జెట్టి, లియోన్ బోయపాటి, శ్రీనివాస్ వీరమాచినేని, సుధీర్ ఉన్నం, శ్రీకర్ రెడ్డి భవనం, కృష్ణమోహన్ మట్టపర్తి, భాస్కర్ వల్లభనేని, సుబ్బా యంత్ర, వీరు ఉప్పల, విజయ్ గుమ్మడి, రవికిరణ్ ఆలేటి, హరి సన్నిధి, సురేష్ ద్రోణవల్లి, నాగేశ్వర రావు వెనిగళ్ల, రాజేష్ పర్వతనేని, రజనీకాంత్ కాకర్ల, సీతారాం కొడాలి, శ్రీనివాస్ వీరమళ్ల, కల్యాణ్‌ కోట, లక్ష్మణ్ పరుచూరి, స్వరూప్ వాసిరెడ్డి, సతీష్ బోళ్ల, కార్తీక్ లేళ్ల, సందీప్ ఇంటూరి, వెంకట్ కోగంటి (బిర్యాని జంక్షన్), మధు (బిర్యాని జంక్షన్), రాజశేఖర్ (బిర్యాని జంక్షన్), సాయి కంభంపాటి, భాస్కర్ మొలకలపల్లి, ప్రకాష్ మద్దిపాటి, నవీన్ కొడాలి తదితరులు సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి మురళి గొడవర్తి, శ్రీనివాస్ గొడవర్తి సాంకేతిక సహకారం అందించారు. హరి బడుగు, హారిక బడుగులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. భీమవరం రుచులు, బిర్యాని జంక్షన్, మిస్టర్ బిర్యాని, ఫ్లయింగ్ ఇడ్లీస్, సావిస్ ఇండియన్ గ్రోసరీస్ సంస్థలు ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ పసందైన భోజనం సమకూర్చాయి. కార్యక్రమ నిర్వాహకులు శ్రీకాంత్ దొడ్డపనేని, భక్తా బల్లా, చంద్ర గుంటుపల్లి, వెంకట్ అడుసుమల్లి కార్యక్రమం విజయవంతమవ్వడానికి కృషిచేసిన వాలంటీర్లకు, స్పాన్సరర్లకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని