
Published : 17 Apr 2021 22:54 IST
‘గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం’ టీకా పంపిణీ
వాషింగ్టన్: గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. రాజధాని ప్రాంతంలో తొలి డోసు పంపిణీ నిర్వహించారు. దాదాపు 700 మంది ప్రవాసుల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సంఘం అధ్యక్షురాలు సుధ పాలడుగు పర్యవేక్షిస్తున్నారు. బోర్డు డైరెక్టర్ ఫణి తాళ్లూరి సహకారంతో కొనసాగిస్తున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. సేవా రంగంలో ఎల్లప్పుడూ తమదైన ముద్రను ఇక ముందూ కొనసాగిస్తామని ఆ సంఘం కార్యవర్గ సభ్యులు తెలిపారు.
Tags :