Gun Fire: అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఓక్లహామాలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆస్పత్రి క్యాంపస్‌ భవనంలో

Updated : 02 Jun 2022 07:36 IST

ఓక్లహామా: అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలో ఉన్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆస్పత్రి క్యాంపస్‌ భవనంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాల్పులు జరిపేందుకు వచ్చిన దుండగుడు కూడా చనిపోయినట్లు సమాచారం. కాల్పులు జరిగే సమయంలో భయాందోనకు గురైన వైద్య సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని