10 డాలర్లకే కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్ల పంపిణీ

అమెరికాలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా ఒక్కరోజే 10లక్షలకు పైగా కేసులు రావడంతో అగ్రరాజ్యం విలవిలలాడుతోంది......

Updated : 04 Jan 2022 18:35 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా ఒక్కరోజే 10లక్షలకు పైగా కేసులు రావడంతో అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకొనేందుకు వీలుగా బృహత్తర వాషింగ్టన్‌ సాంస్కృతిక తెలుగు సంఘం (GWTCS) - చేతన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హోమ్‌ కొవిడ్ టెస్టింగ్‌ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో కిట్‌ని 10 డాలర్లకే పంపిణీ చేశారు. ఎవరికైనా ఈ కిట్లు అత్యవసరంగా కావాలనుకుంటే https://tinyurl.com/GWTCS-COVID-testing-kitsలో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. ఈ కిట్లను జనవరి 4వ తేదీ మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల మధ్య మాంటిస్సోరి చిల్డ్రన్స్‌ సెంటర్‌, 2745 సెంటర్‌ విల్లే రోడ్‌, హెర్న్‌డన్‌, వర్జీనియా 20171 అడ్రస్‌లో పొందవచ్చని జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షురాలు సాయి సుధ తెలిపారు. మొత్తంగా మూడు వేల కిట్లు పంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన, త్రిలోక్‌, అనిల్‌, రవి, రామ్‌చౌదరి తదితరులు పాల్గొని చేతన ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts