బర్మింగ్‌హామ్‌లో ‘హీల్’ ఛారిటీ నైట్‌కు విశేష స్పందన
యూకేలోని బర్మింగ్‌హామ్‌లో హీల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛారిటీ నైట్‌కు విశేష స్పందన లభించింది.
బర్మింగ్‌హామ్: యూకేలోని బర్మింగ్‌హామ్‌లో హీల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛారిటీ నైట్‌కు విశేష స్పందన లభించింది. గన్నవరం సమీపంలోని తోటపల్లిలో అందరికీ వైద్యం, విద్య అందించేందుకు నిధులు సేకరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు 400 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి హీల్ వ్యవస్థాపకులు డా. ప్రసాద్ కోనేరు హాజరై తమ సంస్థ కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులతో 1000 మంది బాలలకు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే, గత 40 ఏళ్లలో 16వేల మందికి పైగా పిల్లలకు అన్నివిధాలా సహకరించినట్టు వివరించారు. బర్మింగ్‌హామ్ బృందం ఛారిటీ ఈవెంట్ నిర్వహించడం ద్వారా 12వేల పౌండ్లు సేకరించిందన్నారు.
అలాగే, గ్రేట్ బర్మింగ్‌హామ్ 10కె రన్, హీల్ క్రికెట్ ఛారిటీ ద్వారా నిధులు సేకరించినట్టు తెలిపారు. ‘హీల్’ద్వారా అనేకమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపడంలో భాగస్వాములైనందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. మరోవైపు, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఫారూక్ ఇంజినీర్ ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొని మాట్లాడారు. లెజెండరీ క్రికెటర్లు సంతకం చేసిన బ్యాట్‌లను ఆయన విరాళంగా అందజేశారు. వాటిని వేలం వేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బర్మింగ్ హామ్ ఛారిటీ నిర్వాహకులు డా. కాటంనేని రవీంద్ర, అట్లూరి సురేష్తో పాటు వల్లె గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ