టొరంటోలో అంబరాన్ని తాకిన హార్ట్‌ఫుల్‌ నెస్‌ వార్షిక వేడుకలు

టొరంటోలో హార్ట్‌ఫుల్‌ నెస్‌ సంస్థ 49వ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. దాదాపు వెయ్యిమంది ప్రవాస భారతీయులు పాల్గొని సందడి చేశారు.

Published : 30 Jan 2023 17:12 IST

టొరంటో: కెనడాలోని టొరంటో నగరంలో హార్ట్‌ఫుల్‌ నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ 49వ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాల్ని చాటి చెప్పేలా నిర్వహించిన ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వంద మంది కళాకారులు సంగీతం, నృత్యం, వాయిద్యాలతో ఇచ్చిన ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ ప్రదర్శనలు కొనసాగుతున్నంత సేపు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ సభ్యులు ముగ్గురు యోగా, ధ్యానం వాటి ఉపయోగాలను వివరించారు. ప్రేక్షకులతో పది నిముషాల పాటు ధ్యానం చేయించారు. దీంతో తమకెంతో రిలాక్స్‌గా, మనసు తేలిక అయిన అనుభూతి పొందామని పలువురు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కెనడాలోని హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ ప్రధాన నిర్వాహకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా  బిర్చ్‌మౌంట్ ఫ్రెండ్స్ క్లబ్(BFC), ఒంటారియో తెలుగు ఫౌండేషన్, దుర్హం తెలుగు క్లబ్ సంస్థలు.. ముఖ్యంగా సూర్య కొండేటి, మురళీరెడ్డి చెర్ల,  వెంకట్, సర్దార్ ఖాన్ ఎంతో స్ఫూర్తినిచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.

హార్ట్‌ఫుల్‌ నెస్‌ సంబరాల నిర్వహణను తమ భుజస్కందాలపై వేసుకొని కన్నుల పండువగా నిర్వహించిన నిర్వాహకులు విశ్వనాథన్ శ్రీనివాసన్, మోహన్ బోండా, సూర్య కొండేటి, మురళీ రెడ్డిచర్ల, వెంకట్ చిలువేరులను ఆయా సంస్థల సభ్యులు అభినందించారు. థోర్న్‌హిల్‌ ఎంపీపీ లారా స్మిత్,  ఎంపీపీ దీపక్ ఆనంద్, థార్న్‌హిల్ ఎంపీ మెలిస్సా లాంట్స్‌మన్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన అతిథులందరికీ నిర్వాహకులు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. భావితరాల్లో మంచి లక్షణాల్ని పెంపొందించేందుకు కృషిచేస్తున్నామని.. తెలుగు ఔన్నత్యాన్ని పెంచేలా మరినర్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా టొరంటో హార్ట్‌ఫుల్ నెస్ నిర్వాహక కార్యదర్శులు విశ్వనాథన్, మోహన్ బోండా తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు