డార్ట్‌ఫోర్డ్‌ నగరంలో ఉత్సాహంగా హోలీ వేడుకలు

బ్రిటన్‌లోని డార్ట్‌ఫోర్డ్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు ప్రముఖులు పాల్గొని రంగుల పండుగలో సందడి చేశారు.

Published : 09 Mar 2023 18:10 IST

డార్ట్‌ఫోర్డ్‌: యూకేలోని డార్ట్‌ఫోర్డ్‌ నగరంలో హోలీ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. భారత్‌లో ఎంతో ఘనంగా నిర్వహించుకొనే ఈ రంగుల పండగను ప్రవాసీయులు  బ్రిటన్‌లోనూ ఘనంగా జరుపుకొన్నారు. డార్ట్‌ఫోర్డ్‌ నగరంలో జరిగిన  వేడుకల్లో వెయ్యిందికి పైగా పాల్గొని రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డార్ట్‌ఫోర్డ్‌ బరో కౌన్సిల్‌ ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ సభ్యుల సహకారంతో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. బ్రిటన్‌ పార్లమెంట్ సభ్యుడు గారెత్‌ జాన్సన్‌, మహేష్‌ చావ్లా (ఛాన్సరీ, ప్రోటోకాల్‌ అధిపతి, హైకమిషనర్‌ ఆఫ్‌ ఇండియా-లండన్‌), కౌన్సిలర్‌ పాల్‌ కట్లర్‌ (డార్ట్‌ఫోర్డ్‌ బరో కౌన్సిల్‌- మేయర్‌), జెరెమీ కౌట్‌ MBE (లీడర్‌, డార్ట్‌ఫోర్డ్‌ బరో  కౌన్సిల్‌),  క్రిస్‌ షిప్పం (కౌన్సిలర్‌-డిప్యూటీ లీడర్‌ డార్ట్‌ఫోర్డ్‌ బరో కౌన్సిల్‌), లెఫ్టినెంట్‌ గుర్విందర్‌ సంధర్‌ MBE, కౌన్సిలర్‌ అవతార్‌ సంధు MBE, కౌన్సిలర్‌ రిచర్డ్‌ వెల్స్‌ (డార్ట్‌ఫోర్డ్‌ బరో కౌన్సిల్‌), కౌన్సిలర్‌ థామస్‌ ఆలివర్‌ తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ రంగుల పండుగ అంబరాన్ని తాకింది.

ప్రముఖులంతా హోలీ పర్వదిన శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. విశిష్ట అతిథుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్‌ అందరికీ ఇది ఓ మరపురాని అనుభూతిని కలిగించింది. స్థానిక కమ్యూనిటీ వాలంటీర్లు, డార్ట్‌ఫోర్డ్‌బరో కౌన్సిల్‌ బృందం సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 5న (హోలీకి మూడు రోజుల ముందుగానే) డార్ట్‌ఫోర్డ్‌ సెంట్రల్‌ పార్కులో నిర్వహించిన ఈ ఉచిత ఈవెంట్‌లో  పాల్గొన్నవారు డ్యాన్సులు, వివిధ కార్యక్రమాలతో ఎంతో ఉల్లాసంగా గడిపారని  వాలంటీర్‌ కృష్ణపవన్‌ చల్లా ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు