‘తానా’ మహాసభల్లో ఇళయరాజా సంగీత విభావరి

జులై 7 నుంచి 9వ వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పెన్సిల్వేనియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహాసభల్లో భాగంగా స్వర మాంత్రికుడు ఇళయరాజా సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ‘తానా’ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు అన్నారు.

Published : 04 Jun 2023 03:20 IST

పెన్సిల్వేనియా:  జులై 7 నుంచి 9వ వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పెన్సిల్వేనియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహాసభల్లో భాగంగా స్వర మాంత్రికుడు ఇళయరాజా సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ‘తానా’ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 9న ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఇళయరాజా సంగీతహోరులో ప్రేక్షకులు తడిసి ముద్దవ్వడం ఖాయమని అన్నారు. అమెరికాలోని తెలుగువారిలో ఎందరో ఇళయరాజా అభిమానులు ఉన్నారన్నారు. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా తానా మహాసభల్లో పాల్గొని సంగీత కచేరితో ప్రవాసాంధ్రులను అలరించనున్నారని వెల్లడించారు. ‘తానా’ మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఇళయరాజాను స్వయంగా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారని ఆయన చెప్పారు. ఇళయరాజా సంగీత విభావరి ప్రత్యక్షంగా చూడాలనుకుంటే తానా మహాసభలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం www.tanaconference.org చూడండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని