Updated : 13 Apr 2021 19:01 IST

ధర్మాన్ని ఆచరించాలి.. దైవాన్ని ఆశ్రయించాలి

సింగపూర్‌: ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుసరించడమేనని, మన వేద విజ్ఞాన విలువలను పరిరక్షించుకుని భావితరాలకు అందివ్వాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్‌ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలల్లో భాగంగా అంతర్జాలం వేదికగా షణ్ముఖ శర్మ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ‘ఉగాది విశిష్టత-ధర్మాచరణము’ అనే అంశంపై సమకాలీన పరిస్థితులకు ఉపయోగపడే విధంగా చక్కటి సమయోచితమైన ఉదాహరణలతో షణ్ముక శర్మ ప్రవచించి సింగపూర్ తెలుగు ప్రజలందరికీ ఆశీస్సులను అందజేశారు.

ప్రవచనంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్లవనామ సంవత్సరం శుభప్రదం అయ్యేందుకు రుద్రుని అనుగ్రహం అవసరమని తెలిపి పంచాంగ ప్రాధాన్యాన్ని వర్ణించారు. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుసరించడమేనని, మన వేద విజ్ఞాన విలువలను పరిరక్షించుకుని భావితరాలకు అందివ్వాలన్నారు. జీవితంలో బంధాల విలువ తెలుసుకుని సుఖదుఃఖాలను సమన్వయం చేసుకుంటూ ధర్మాచరణ గావించాలని ఉపదేశించారు. యాంత్రికంగా ఉగాదికి శుభాకాంక్షల సందేశాలు పంచుకోవడం కన్నా.. హృదయపూర్వకంగా ప్రపంచ శాంతిని సౌభాగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ శుభాన్ని ఆకాంక్షించాలన్నారు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నా, ‘ధర్మాన్ని ఆచరించాలి. దైవాన్ని ఆశ్రయించాలి’ ఈ రెండింటి వల్ల ఎటువంటి కష్టాలనైనా అధిగమించవచ్చు అని తెలియజేశారు.

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ లలిత దంపతులు జ్యోతి ప్రకాశనం చేయగా,  విద్యాధరి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో శివ భక్తితత్వాన్ని భక్తి జ్ఞాన మార్గాలను చక్కటి తెలుగు సాహిత్యంతో మేళవించి సామవేదం రచించిన గేయ సంపుటి ‘శివపదం’ నుంచి కొన్ని కీర్తనలు ఎంపిక చేసుకుని సింగపూర్ గాయనీ గాయకులు సౌభాగ్యలక్ష్మి, శైలజ, పద్మావతి, రాధిక, ఆనంత్, షర్మిల, విద్యాధరి భక్తిగా ఆలపించారు. చామిరాజు రామాంజనేయులు వ్యాఖ్యాన సమన్వయంలో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో భాస్కర్ ఊలపల్లి,  రాధికా మంగిపూడి, సుబ్బలక్ష్మి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించగా, ఈ రెమిట్ (శ్రీహరి శిఖాకొల్లు), గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్, EGA జూస్ వారు ఆర్ధిక సమన్వయం అందించారు.


అలరించిన లఘు చిత్రం

ఉగాది విశిష్టతను ఈతరం పిల్లలకు తెలియజేసేలా రూపొందించిన లఘు చిత్రం అందరినీ ఆకర్షిస్తోంది. చక్కటి పాత్రలు సంభాషణలతో సింగపూర్ తెలుగు టీవీ ద్వారా యూట్యూబ్‌లో విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఖ్యాతి గణేశ్న, వందన నాదెళ్ల , మౌక్తిక నాగెళ్ల , అక్షర మడిశెట్టి, రత్నకుమార్ కవుటూరు, ప్రత్యూష అవధానుల, దివ్య మరందని, కిరణ్ కుమార్, మూర్తి నాగేళ్ల ఇందులో నటించారు. కళ్యాణ్‌ ధవల, మాధురి మంతా కథ, సంభాషణలు అందించగా, కళ్యాణ్ ధవల, రాధా కృష్ణ గణేశ్న దర్శకత్వం వహించారు. కాత్యాయనీ గణేశ్న నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించారు.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని