ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న అమెరికా తెలుగు అసోసియేషన్

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పరేడ్‌లో అమెరికా తెలుగు ఆసోసియేషన్(అటా) పాల్గొంది.........

Published : 29 Aug 2022 23:40 IST

న్యూయార్క్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పరేడ్‌లో అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) పాల్గొంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. గ్రాండ్ మార్షల్ హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. ఆటా న్యూజెర్సీ ప్రాంతీయ సమన్వయకర్త సంతోష్‌రెడ్డి  కోరం, జంబుల విలాస్‌రెడ్డి ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు భువనేశ్‌రెడ్డి బుజాల మాట్లాడుతూ.. ఆటా తరఫున భారత దేశ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆటా మాజీ ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, పరశురామ్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ.. న్యూయార్క్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల నుంచి దాదాపు ఐదు లక్షల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తరలివచ్చినట్లు పేర్కొన్నారు.

శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, సుధాకర్ పెర్కారీ, విజయ్ కుందూరు, శ్రీనివాస్ దార్గుల, మహేందర్ ముసుకు, వినోద్ కోడూరు, రాజ్ చిలుముల, సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్ట, జంబుల విలాస్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో దోహదపడ్డారు. భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఇషాని రెడ్డి, రిషిత జంబుల, అయాన్ రెడ్డి తుమ్మల, మాన్వి మైకా తదితరుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రామ్ వేముల, లక్ష్మణ్ రెడ్డి అనుగు, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రొఫెసర్ రాజశేఖర్ వంగపటి, శ్రీధర్ నాగిరెడ్డి, వేణు నక్షత్రం, నందిని దార్గుల, అనురాధ చిలుముల, వాణి అనుగు, మహేందర్ ముసుకు, వినోద్ కోడూరు, రఘు రెడ్డి, సుధాకర్ పెర్కారీ, ప్రదీప్ కట్ట, జంబుల విలాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని