మార్చి 2న ‘ఇండియా గివింగ్ డే’.. విరాళాలకు ‘అగస్త్య యూఎస్‌ఏ’ పిలుపు
భారతదేశంలోని పేదలకు సాయం చేసేందుకు అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు, ఇండో అమెరికన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ‘ఇండియా గివింగ్ డే’ను నిర్వహిస్తున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: భారతదేశంలోని పేదలకు సాయం చేసేందుకు అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు, ఇండో అమెరికన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ‘ఇండియా గివింగ్ డే’ను నిర్వహిస్తున్నాయి. ఇండియా ఫిలాంత్రఫీ అలయెన్స్ (ఐపీఏ) పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ‘అగస్త్య యూఎస్‌ఏ’తోపాటు అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటున్నాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వాన్ని మెరుగుపరిచేందుకు.. పేదరికంలో ఉన్న భారతీయుల ఇతర ముఖ్యమైన అవసరాలను తీర్చే ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చడానికి ఈ విరాళాలను సేకరిస్తున్నారు.
ఈ కూటమి సభ్యులు ఇప్పటికే అమెరికాలో ఏడాదికాలంలో దాదాపు 60 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించారు. వార్షిక సింగిల్-డే పుష్ నిర్వహించడం ద్వారా సమష్టిగా ఒక్కరోజులో మరిన్ని నిధులను సేకరించడమే లక్ష్యంగా ఈ గివింగ్ డేను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని నలుమూలలా నివసించే వారి నుంచి ఈ కూటమి విరాళాలను స్వాగతిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్లు, ప్రవాస భారతీయుల నుంచి చందాలు, విరాళాలు సేకరించడమే ఈ ఈవెంట్ లక్ష్యం.
2022 గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా భారత్‌లో 228.9 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని ‘అగస్త్య యూఎస్‌ఏ’ తెలిపింది. అమెరికాలో నివాసముంటున్న ఎన్‌ఆర్‌ఐలు, ఇండో అమెరికన్ల నుంచి విరాళాలు ఆశిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని 2.7 మిలియన్ల ప్రవాస భారతీయులు, అమెరికాలో పుట్టిన భారతీయ సంతతికి చెందిన 1.3 మిలియన్ల ఇండో అమెరికన్ల నుంచి విరాళాలను ఆశిస్తున్నట్లు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Toll Charges: టోల్ రుసుముల పెంపు అమలులోకి..
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం