వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా భారత స్వాతంత్ర్య వేడుకలు

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ నగరంలో తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. .....

Updated : 15 Aug 2022 17:30 IST

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ నగరంలో తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించి వినూత్నంగా జరుపుకొన్నారు. జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షులు సాయిసుధ పాలడుగు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు తరలివచ్చి జాతీయ పతాకాలు పట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, బలిదానాలు తర్వాత భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్ని తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం మరపురానిదన్నారు. అమెరికాలో ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. వారంతా భారతదేశ కీర్తి ప్రతిష్టలు తెచ్చేందుకు తమవంతుగా కృషిచేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం సాయి సుధ మాట్లాడుతూ.. భారతీయులు ఎక్కడ ఉన్నా ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా, పండుగలా జరుపుకొంటారన్నారు. అమెరికాలో తొలుత ఏర్పాటు చేసిన తెలుగు సంఘం జీడబ్ల్యూటీసీఎస్‌ అని చెప్పారు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థకు తాను అధ్యక్షురాలు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కరోనా లాంటి మహమ్మారిని సైతం లెక్కచేయకుండా తమ పాలకమండలి అనేక సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేపట్టిందని ఆమె తెలిపారు.

స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ స్వాతంత్ర్య వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నట్టు తానా మాజీ అధ్యక్షుడు సతీశ్ వేమన అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న తెలుగువారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన పాలకమండలిని ఆయన అభినందించారు. అనంతరం మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడేలా జాతి గౌరవాన్ని పెంపొందించారని ప్రశంసించారు. చివరిగా భాను మాగులూరి వందన సమర్పన చేశారు. ఈ కార్యక్రమంలో అన్షుల్ శర్మ (కౌన్సెలర్ ఇండియన్ ఎంబసీ), సత్యనారాయణ మన్నె, చంద్ర మల్లావతు, కృష్ణ లాం, రవి అడుసుమల్లి, రాజేష్ కాసరనేని, ఫణి తాళ్లూరు, శ్రీనివాస్ గంగా, యాష్ బద్దులూరి, సుశాంత్ మన్నె, సుష్మ అమృతలూరు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని