షికాగోలో ఘనంగా భారత స్వాతంత్ర్య వేడుకలు

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని అమెరికాలోని షికాగోలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇండియన్‌ కమ్యూనిటీ ఔట్‌ రీచ్‌ (ఐసీవో) ఆధ్వర్యంలో నిర్వహించిన

Published : 16 Aug 2022 11:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని అమెరికాలోని షికాగోలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇండియన్‌ కమ్యూనిటీ ఔట్‌ రీచ్‌ (ఐసీవో) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ భారతీయ సంఘాలు, ప్రముఖ తెలుగు సంఘాలు తానా, షికాగో ఆంధ్ర అసోసియేషన్‌ పాల్గొన్నాయి. భారతీయ సంఘాలకు ఇల్లినాయిస్‌ స్టేట్‌ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మద్దతుగా నిలిచారు. వేడుకలను ఉద్దేశించి షికాగో ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ అమిత్‌కుమార్‌, ఐసీవో సీఈవో కృష్ణ బన్సాల్‌ మాట్లాడారు. బాలీవుడ్‌ సింగర్‌ గురు రంధావా లైవ్‌ కాన్సర్ట్‌కు భారీగా ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో షికాగోకు చెందిన తానా నాయకుడు హేమ కానూరు, మిడ్‌ వెస్ట్‌ రీజినల్‌ ప్రెసిడెంట్‌ హను చెరుకూరి, తానా ప్రతినిధులు రవి కాకర, కృష్ణ మోహన్‌, చిరంజీవి గళ్ల తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఖ్యాతిని, స్వాతంత్ర్యం సాధించడంలో తెలుగు వాళ్లు చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు