PM Modi: మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ఇండో అమెరికన్లు

ప్రధాని మోదీ అమెరికా పర్యటనను పురస్కరించుకొని, ఆయనకు స్వాగతం పలికేందుకు అక్కడి ఇండో అమెరికన్లు సిద్ధమవుతున్నారు.

Updated : 19 Jun 2023 19:06 IST

న్యూయార్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న అమెరికాలో అధికారిక పర్యటన చేపట్టనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇండో అమెరికన్లు సమాయత్తమవుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద ‘‘ఇండో అమెరికన్ కమ్యూనిటీ’’ ఆధ్వర్యంలో మోదీకి స్వాగతం అంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధంగా అమెరికాలో 20 పట్టణాల్లోని ప్రసిద్ధి గాంచిన స్థలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్‌ 21న న్యూయార్క్‌ నగరంలో నిర్వహించనున్న యోగా దినోత్సవంలో మోదీ పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 22న వైట్‌హౌస్‌లో ఆయనకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ దంపతులు గౌరవ విందు ఇస్తారు. మోదీ చేపట్టనున్న ఈ పర్యటన కోసం యావత్‌ భారతీయ అమెరికన్ సమాజం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని అడపా ప్రసాద్ తెలిపారు. జూన్ 21న వైమానిక స్థావరం వద్దకు వెళ్లి మోదీకి స్వాగతం చెప్పేందుకు ఇండో అమెరికన్లు సిద్ధమవుతున్నారని కృష్ణారెడ్డి ఏనుగుల, విలాస్‌ జంబుల పేర్కొన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని