ATA: రెట్రో నైట్ లైట్స్ అఫ్ అరిజోనా నేపథ్య సంగీత వేడుక

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో అద్భుతమైన రెట్రో నేపథ్య పార్టీకి ఫీనిక్స్ ఆతిథ్యమిచ్చింది. మనోహరమైన సంగీతాన్ని మరియు ఆనందాన్ని ప్రేక్షకులకు అందించింది.

Published : 20 Sep 2023 17:33 IST

అరిజోనా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో అద్భుతమైన రెట్రో నేపథ్య పార్టీకి ఫీనిక్స్ ఆతిథ్యమిచ్చింది. మనోహరమైన సంగీతాన్ని, ఆనందాన్ని ప్రేక్షకులకు అందించింది. ఈ వేడుక భారతీయ సినిమా స్ఫూర్తిని, చలనచిత్ర వాతావరణాన్ని తీసుకొచ్చింది. వినోదాన్ని పొందేందుకు అన్ని వర్గాల నుంచి అతిథులు హాజరయ్యారు.

సెప్టెంబర్ 8 సాయంత్రం జరిగిన ఈ వేడుకలో దాదాపు 300 మంది పాల్గొన్నారు. ఫ్యాషన్‌ కార్యక్రమాల్లో భాగంగా సొగసైన చీరల నుంచి షేర్వాణీలను ప్రదర్శించారు. అద్భుతమైన అలంకరణ, మిరుమిట్లు గొలిపే వెలుగులు, నేపథ్య సంగీతంతో గుర్తుండిపోయే వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక నృత్య ప్రదర్శనలతో మారుమోగింది. తెలుగు నటి లయ, సంగీత దర్శకుడు-గాయకుడు రఘు కుంచె తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. 

అరిజోనాలోని ఫీనిక్స్‌లో సంగీత వేడుక నిర్వహించడానికి వేదికను అందించిన ‘ఆటా’ అందరినీ అలరించింది. ప్రాంతీయ డైరెక్టర్ రఘు ఘాడీ భవిష్యత్తులోనూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సమాజ సేవను ప్రోత్సహించడం, సాంస్కృతిక వైవిధ్యం, భారతీయ వారసత్వాన్ని అందించడం వంటి ప్రణాళికలను ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ కోఆర్డినేటర్లు చెన్నయ్య మద్దూరి, వంశీ ఏరువరం, శేషిరెడ్డి గాదె, సునీల్ అన్నపురెడ్డి, ఫరితొష్ పొలి, మహిళా ఛైర్‌పర్సన్ శుభ, బింద్య, నివేదిత ఘాడీ తదితరులు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని