Louisville - Jalsa: లుయివిల్‌లో అదిరిపోయిన ‘జల్సా’ వేడుకలు

యూనివర్సిటీ ఆఫ్ లుయివిల్‌లో భారత దేశ విద్యార్థులు ‘జల్సా’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

Updated : 14 Nov 2022 17:09 IST

లుయివిల్‌: యూఎస్‌ కెంటకీ రాష్టంలోని లుయివిల్ నగరంలో భారత విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ ఆఫ్ లుయివిల్ విద్యార్థులు ‘జల్సా’ పేరుతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. భారత విద్యార్థి సంఘం (Indian Stuedents Association) ఆధ్వర్యంలో జరిగిన ‘జల్సా’ వేడుకల్లో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత, అమెరికన్ జాతీయ గీతాలాపనతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 

భారత సంస్కృతిని, సంప్రదాయాలను విద్యార్థులు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నృత్యరీతులను ప్రదర్శించారు. తెలుగు సినీ గీతాలకు అమెరికన్ విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సాకేత్, సాయి, హర్షిత్ ప్రదర్శించిన ‘జాతిరత్నాలు’ స్పూఫ్ కడుపుబ్బా నవ్వించింది. సరయు అల్లి నేతృత్వం వహించిన ఫ్యాషన్ షో, విద్యార్థుల భాంగ్రా నృత్యాలు, కార్తీక్ మళయాల పాడిన పాటలు అలరించాయి.

ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం డైరెక్టర్ శ్రీవత్స వేమూరి.. వివిధ విభాగాల సమన్వయకర్తలను పరిచయం చేశారు. స్క్రిప్ట్ బాధ్యతలను శ్రీవాస వేమూరి నిర్వహించారు. స్థానిక వ్యాపార సంస్థలు విరాళాలు సమకూర్చి విద్యార్థులను ప్రోత్సహించాయి.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని