Khammam: ఖమ్మం బాలుడిని దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు
ఇటలీ దేశానికి చెందిన ఆ దంపతులకు పిల్లలు లేరు. ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకోవాలని భావించారు. అంతర్జాలంలో వెతుకుతుండగా... ఖమ్మానికి చెందిన బాలుణ్ని ప్రభుత్వం దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చూశారు.
బాలుడిని ఇటలీ దంపతులకు అప్పగిస్తున్న కలెక్టర్ వీపీ గౌతమ్, డీడబ్ల్యూఓ జ్యోతి, డీసీపీఓ విష్ణు వందన
ఖమ్మం కమాన్‌బజార్, న్యూస్‌టుడే: ఇటలీ దేశానికి చెందిన ఆ దంపతులకు పిల్లలు లేరు. ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకోవాలని భావించారు. అంతర్జాలంలో వెతుకుతుండగా... ఖమ్మానికి చెందిన బాలుణ్ని ప్రభుత్వం దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చూశారు. ఇంకేముంది వెంటనే అధికారులను సంప్రదించారు. ప్రభుత్వ దత్తత నిబంధనలన్నీ పూర్తి చేశారు. వారిలో వెళ్లేందుకు బాలుడు కూడా అంగీకరించాడు. సోమవారం ఖమ్మం వచ్చిన ఇటలీ దంపతులకు కలెక్టర్ వీపీ గౌతమ్ బాలుణ్ని అప్పగించారు. ఇంతకాలం పిల్లలు లేని వారికి పుత్ర వాత్సల్యం, అనాథగా బతుకీడుస్తున్న బాలుడికి కుటుంబ ప్రేమ లభించనున్నాయి.
* తన కుమారుడిని సాకలేనని ఓ తల్లి పదేళ్ల కిందట ఖమ్మం శిశుగృహకు అప్పగించి వెళ్లింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ బాబును అనాథగా ప్రకటించి సంరక్షణ బాధ్యతలను చేపట్టింది. ప్రస్తుతం అతను నాలుగో తరగతి చదువుతున్నాడు. బాలుడిని దత్తత ఇచ్చేందుకు వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్ కారా(సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ)లో ఉంచారు. ఇలా కాలం గడిచిపోతున్న తరుణంలో ఇటలీకి చెందిన దంపతులు స్టెఫానో పెట్టొరలి, మరీనా గత ఏడాది జూన్‌లో కారా సైట్‌ను సంప్రదించారు. అధీకృత విదేశీ అడాప్షన్ ఏజెన్సీ సహకారంతో అడిగిన అన్ని పత్రాలు సమర్పించారు. బాలుడిని దత్తత తీసుకునేందుకు అంగీకరిస్తూ ప్రక్రియను కొనసాగించారు. ఈ ఇద్దరూ ఇటలీలో ఉద్యోగులు. భారత ప్రభుత్వ దత్తత నిబంధనల ప్రకారం అన్ని అంశాలను పరిశీలించిన అధికారులు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ నియమం ప్రకారం దత్తత స్వీకరించే దంపతులతో పాటు ఎనిమిదేళ్ల వయసు దాటిన పిల్లల స్వీయ అంగీకారం కూడా తప్పనిసరి. సదరు బాలుడిని నాలుగు నెలల పాటు కౌన్సెలింగ్ చేసిన తర్వాత అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. బాలుడు కూడా వారితో వెళ్లేందుకు అంగీకారం తెలిపాడు. దీంతో కలెక్టర్ వీపీ గౌతమ్ సమక్షంలో డీడబ్ల్యూఓ జ్యోతి, డీసీపీఓ విష్ణువందన సదరు బాలుడిని సోమవారం అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్