ఎన్‌ఆర్‌ఐ తెదేపా అమెరికా కోఆర్డినేటర్‌గా జయరాం కోమటి

ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ (అమెరికా) కోఆర్డినేటర్‌గా జయరాం కోమటి నియమితులయ్యారు.

Updated : 13 Apr 2022 11:04 IST

అమరావతి: ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ (అమెరికా) కోఆర్డినేటర్‌గా జయరాం కోమటి నియమితులయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జయరాం కోమటిని నియమించినట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో బాధ్యత అప్పగించిన చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో పార్టీ పటిష్ఠతకు మరింత కృషి చేస్తానని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఏపీలో తెదేపా విజయమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. జయరాం కోమటి నియామకంపై ప్రవాసాంధ్రులు, తెదేపా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని